Nirbhaya Case : నేడు పవన్ గుప్తా పిటిషన్ పై విచారణ

Nirbhaya Case : నేడు పవన్ గుప్తా పిటిషన్ పై విచారణ
x
Highlights

ఢిల్లీలో గ్యాంగ్‌రేప్ నిందితుడు పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. తన మరణశిక్షను జీవిత ఖైదుగా...

ఢిల్లీలో గ్యాంగ్‌రేప్ నిందితుడు పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. తన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని 25 ఏళ్ల పవన్ గుప్తా పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎన్‌వి రమణ, అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమన్, ఆర్ బానుమతి, అశోక్ భూషణ్ ధర్మాసనం జస్టిస్ రమణ ఛాంబర్‌లో పరిశీలిస్తుందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. చివరిసారిగా హాజరైన పాఠశాల రికార్డుల ప్రకారం.. 2012 లో నేరం జరిగిన రోజున తన వయస్సు 16 సంవత్సరాల రెండు నెలలు అని పవన్ గుప్తా తన పిటిషన్ లో పేర్కొన్నాడు.

పవన్ గుప్తా ఇప్పటివరకు ఎటువంటి న్యాయావకాశాలను పొందలేదు.. ఈ క్రమంలో అతని పిటిషన్ పై ఎటువంటి తీర్పు వస్తుందో అని ఆసక్తికరంగా దేశం ఎదురుచూస్తోంది. కాగా ఇప్పటికే ఉరిశిక్ష రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో ఉరికి ముందు పవన్ కుమార్ క్యూరేటివ్ పిటిషన్ ను దాఖలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికే అతను ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలావుంటే దోషులలో ఒకరైన అక్షయ్ ఠాకూర్ ఫిబ్రవరి 29 న రాష్ట్రపతికి క్షమాబిక్ష పెట్టమని వేడుకున్నారు. ఇంతకు ముందు ముఖేష్, వినయ్ మరియు అక్షయ్ అనే ముగ్గురు దోషుల క్షమాబిక్ష పిటిషన్లను అప్పటికే రాష్ట్రపతి కొట్టివేసారు. అలాగే, క్షమాబిక్ష పిటిషన్లను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముఖేష్ మరియు వినయ్ దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్లను కోర్టు గతంలో కొట్టివేసింది.

కాగా పవన్ కుమార్ తో సహా నలుగురు దోషులను ఉరితీయాలని ఇప్పటికే ఢిల్లీ హైకోర్ట్ డెత్ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 3న ఉదయం నలుగురు నిందితులను ఒకేసారి చనిపోయేంతవరకు ఉరి తీయనున్నారు. వారిని ఉరి తీసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్టు నిర్భయ తల్లి తెలిపారు. రేపు నిర్భయ నిందితులను ఖచ్చితంగా ఉరి తీస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories