Big Breaking : సూడాన్‌లో భారీ పెలుడు..18 మంది భారతీయులు సజీవదహనం


సూడాన్ దేశం ఓ సెరామిక్స్ ఫ్యాక్టరీలో భారీ పెలుడు సంభవించింది.
సూడాన్ దేశం ఓ సెరామిక్స్ ఫ్యాక్టరీలో భారీ పెలుడు సంభవించింది. ఈ ఘటనలో 18మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. సూడాన్‌లోని బహ్రీ అనే పట్టణంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం కోబర్ నైబర్‌హుడ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని సలోమీ సిరామిక్ ఇండస్ట్రీలో ఓ గ్యాస్ ట్యాంకర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఒక్క సారిగా అగ్నికీలకు ఎగిసి పడడంతో 23 మంది సజీవంగా దహనమైయ్యారు. 330 మందికిపైగా తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అక్కడి ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
ఎంతమంది చినిపోయారనేది అధికారికంగా వెల్లడించలేదు. భారత రాయబార కార్యాలయం 18 మంది భారతీయులు మరణించినట్లు బుధవారం ప్రకటనలో తెలిపింది. మంటల్లో మృతదేహాలు కాలిపోవడంతో వారిని గుర్తిచడం సాధ్యపడలేదని తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి జాబితాను విడుదల చేసింది. 34 మంది భారతీయులను సురక్షిత పంపించినట్లు తెలిపింది. సెరామిక్స్ ఫ్యాక్టరీలో జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోర ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారని, 130 మందికి పైగా గాయపడ్డారని ఏఎఫ్‌పీ రిపోర్టులో వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
Have just received the tragic news of a major blast in a ceramic factory "Saloomi" in the Bahri area of the capital Khartoum in Sudan. Deeply grieved to learn that some Indian workers have lost their lives while some others have been seriously injured.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) December 4, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



