CBI Director: సీబీఐ డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్

Subodh Kumar Jaiswal Appointed as CBI Director
x

CBI New Director Subodh Kumar Jaiswal:(twitter)

Highlights

CBI Director: ఐపీఎస్ అధికారి సుభోద్ కుమార్ జైస్వాల్ ఐపీఎస్‌ను సీబీఐ చీఫ్‌గా నియమితులయ్యారు.

CBI Director: సీబీఐకి కొత్త బాస్ ఎంపికయ్యారు. ఐపీఎస్ అధికారి సుభోద్ కుమార్ జైస్వాల్ ఐపీఎస్‌ను సీబీఐ చీఫ్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీవోపీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన, పార్లమెంట్‌లో విపక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇతడిని నియమించింది. సుభోద్ కుమార్ 1985 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందినవాడు. కాగా, డైరెక్టర్‌గా ఉన్న ఆర్‌కే శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో సీబీఐ అదనపు డైరెక్టర్‌ ప్రవీణ్‌ సిన్హా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అయితే ఈ పదవికి ఎంపికైన వారు రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. నాలుగు నెలల ముందుగానే కమిటీ సమావేశమై సీబీఐ కొత్త డైరెక్టర్‌ ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ.. వివిధ కారణాలతో ఆలస్యమైంది. జైస్వాల్ ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఇంతకుముందు ముంబై పోలీసు కమిషనర్, మహారాష్ట్ర డిజిపి పదవులను నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories