logo
జాతీయం

బీహార్‌లో విద్యార్థుల నిరసన హోరు...

Student protest in Bihar
X

బీహార్‌లో విద్యార్థుల నిరసన హోరు...

Highlights

Bihar: ఉద్రిక్తంగా మారుతున్న బీహార్‌ బంద్‌, రాజధాని పాట్నాతో పాటు పలు ప్రాంతాల్లో..

Bihar: బీహార్‌లో విద్యార్థుల బంద్‌ ఉద్రిక్తంగా మారింది. రాజధాని పాట్నాతో పాటు పలు ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్లు, రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌‌లో అక్రమాలపై ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ అసోషియేషన్‌తో పాటు పలు విద్యార్థి సంఘాలు బీహార్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు విపక్షాల అధ్వర్యంలోని మహాకూటమి మద్దతు పలికింది.

రైల్వే రిక్రూట్‌ బోర్డు తీరుకు నిరసనగా... రిపబ్లిక్ డే రోజున విద్యార్థులు బీహార్‌లోని ఓ ప్యాసింజర్‌ రైలుకు నిప్పంటించగా, మరో రైలుపై రాళ్ల దాడి నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలపై విపక్షాల ఆధ్వర్యంలోని మహాకూటమి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యార్థులు భారీగా తరలివచ్చారు. రాజధాని పాట్నాతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లను, రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించారు.

ఆయా ప్రాంతాల్లో పోలీసులు విద్యార్థులను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విద్యార్థులకు మద్దతుగా విపక్షాలు పలు ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశాయి. రైల్వేశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మహాకూటమిలోని ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఆరోపించాయి. ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వాలు.. విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే దాడికి దిగుతుతున్నాయని మండిపడ్డాయి. దేశంలోనే బీహార్‌లోనే అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నారని.. విప‌క్షాలు తెలిపాయి.


Web TitleStudent protest in Bihar
Next Story