Bigg Boss 13 ..నిలిపేయండి.. నైతిక విలువలు ప‌త‌నం చేస్తోంది

Bigg Boss 13 ..నిలిపేయండి.. నైతిక విలువలు ప‌త‌నం చేస్తోంది
x
Highlights

టీవీలో వచ్చే బిగ్‌బాస్-13 ప్రసారాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ యూపీలోని ఘజియాబాద్ ఎమ్మెల్యే నంద్ కిషోర్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈషో సమాజంలో నైతిక విలువలను పతనం చేస్తోందని ఆరోపించారు.

టీవీలో వచ్చే బిగ్‌బాస్-13 ప్రసారాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఎమ్మెల్యే నంద్ కిషోర్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈషో సమాజంలోని నైతిక విలువలను పతనం చేస్తోందని ఆరోపించారు. హిందీ భాషలో వచ్చే బిగ్‌బాస్ కార్యక్రమం వలన చాలామంది యువత పెడదారి పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. హిందీలో వచ్చే బిగ్ బాస్-13 కార్యక్రమంలో పార్టిసిపేట్స్‎ సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, బిగ్‌బాస్-13 షోలో అసభ్యత మరీ ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే హిందీ బిగ్ బాస్ ప్రసారాలను నిలివేయాలని నంద్ కిషోర్ గుర్‌జార్‌ డిమాండ్ చేశారు. అంతే కాకుండా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్‎కు లేఖ రాశారు. దీనిపై బిగ్‌బాస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories