'మద్యం'పై మేఘాలయ బీజేపీ చీఫ్‌ సంచలన విన్నపం

మద్యంపై మేఘాలయ బీజేపీ చీఫ్‌ సంచలన విన్నపం
x
Highlights

మేఘాలయ బీజేపీ చీఫ్‌ ఎర్నెస్ట్‌ మారీ సంచలన విన్నపం చేశారు. మందు తాగడం రాష్ట్ర జీవన విధానంలో భాగమని, అందుకు వైన్‌ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర సీఎం కొన్రాడ్‌ కె. సంగ్మాకు శుక్రవారం లేఖ రాశారు.

మేఘాలయ బీజేపీ చీఫ్‌ ఎర్నెస్ట్‌ మారీ సంచలన విన్నపం చేశారు. మందు తాగడం రాష్ట్ర జీవన విధానంలో భాగమని, అందుకు వైన్‌ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర సీఎం కొన్రాడ్‌ కె. సంగ్మాకు శుక్రవారం లేఖ రాశారు.మేఘాలయ బీజేపీ చీఫ్‌ ఎర్నెస్ట్‌ మారీ సంచలన విన్నపం చేశారు. మందు తాగడం రాష్ట్ర జీవన విధానంలో భాగమని, అందుకు వైన్‌ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర సీఎం కొన్రాడ్‌ కె. సంగ్మాకు శుక్రవారం లేఖ రాశారు.

కరోనా నేపథ్యంలో అమలవుతోన్న మద్యనిషేదంపై ఖాసి హిల్స్ వైన్ డీలర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న ఎర్నెస్ట్‌.. వైన్ షాపు యజమానులు తమ అవుట్ లెట్‌లెట్లను నిర్వహించడానికి తీవ్ర ప్రజా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అంతేకాదు మద్యం షాపులు తెరవాలని అనేక కాల్స్ కూడా వస్తున్నాయని అన్నారు. మార్చి 25 నుండి అకస్మాత్తుగా వైన్ షాపులు మూసివేయడంతో మద్యం కోటాకు విపరీతమైన ప్రజా డిమాండ్ ను సృష్టించిందని చెప్పారు.

"మేఘాలయలో ఎక్కువ మంది ప్రజలు మితంగా మద్యం సేవించడం అనేది జీవన విధానంగా ఉంది" అని ఆయన చెప్పారు. ఇతర ముఖ్యమైన వస్తువులకు కేటాయించిన రోజులలో అనుమతి ఇచ్చినట్టుగానే వైన్ షాపులు తెరవడానికి అనుమతించాలని ముఖ్యమంత్రిని కోరారు. సామాజిక దూరం మరియు ప్రజా పరిశుభ్రత మార్గదర్శకాలను అనుసరిస్తామని చెప్పారు. మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఇంటికి మద్యం పంపిణీకి అనుమతి రద్దు చేసింది.

ఇదిలావుంటే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శుక్రవారానికి మూడు వేల మార్కును రీచ్ అవ్వబోతోంది. మరణాల సంఖ్య అధికారికంగా 60కి పైగా చేరింది. రాష్ట్రాలవారీగా ప్రకటించిన గణాంకాల మేరకు శుక్రవారం ఒక్కరోజే 450 పైచిలుకు కొత్త కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.

గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 647 కేసులు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌ మత కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎక్కువగా ఉన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అనేక కొత్త వైరస్ సంక్రమణ కేసులను నివేదించాయి, ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ సంఘటన కారణంగా ఈ సంఖ్యలు పెరిగాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories