రేపు SSLV-డీ2 రాకెట్ ప్రయోగం

SSLV D2 Rocket Launch Tomorrow
x

రేపు SSLV-డీ2 రాకెట్ ప్రయోగం

Highlights

* మూడు చిన్న తరహా శాటిలైట్లను రోదసిలోకి పంపనున్న ఇస్రో

SSLV D2: షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు ఉదయం 9గంటల18 నిమిషాలకు SSLV డీ-2 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సమాయత్తమవుతున్నారు. ఈ ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి లాంచ్‌ రిహార్స్‌ల్స్‌ను నిర్వహిస్తారు. ఎంఆర్‌ఆర్‌ సమావేశం అనంతరం ప్రయోగపనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగిస్తారు. ల్యాబ్‌ చైర్మన్‌ రాజరాజన్‌ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందే కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రయోగంలో ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్, జానుస్‌–01, ఆజాదీశాట్‌–02 అనే మూడు చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories