Ayodhya: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం.. 30 ఏళ్ల మౌనవత్రాన్ని వీడనున్న ఆమె

Sri Rama Prana Pratishtha on January 22 in Ayodhya
x

Ayodhya: అయోధ్యలో జనవరి 22న రాముడి ప్రాణ‌ప్రతిష్ట

Highlights

Ayodhya: మౌన వ్రతాన్ని వీడుతానని 1992లో ప్రతిజ్ఞ చేసిన సరస్వతీ దేవి

Ayodhya: జార్ఖండ్‌కు చెందిన 85 ఏళ్ల స‌ర‌స్వతి దేవి అగ‌ర్వాల్ క‌ల నెర‌వేర‌బోతోంది. దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత ఆమె త‌న మౌన వ్రతాన్ని వీడ‌నున్నారు. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ట జ‌రిగిన రోజే తాను మౌన వ్రతాన్ని వీడ‌నున్నట్లు 1992లో ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జ‌న‌వ‌రి 22వ తేదీన జ‌ర‌గ‌నున్న ప్రాణ ప్రతిష్ట కోసం ఆమెకు ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆమె క‌ల‌నెర‌వేర‌బోతోంది. జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌కు చెందిన ఆ మ‌హిళ‌..1992లో బాబ్రీ మ‌సీదు కూల్చివేసిన రోజునే మౌన ముద్రలోకి వెళ్లింది. అయోధ్యలో రామాల‌యం క‌ట్టిన రోజునే త‌న మౌన వ్రతాన్ని వీడ‌నున్నట్లు ఆమె ఆ రోజున ప్రతిజ్ఞ పూనారు.

మౌని మాత‌గా పేరు గాంచిన స‌రస్వతీ దేవి త‌మ కుటుంబ స‌భ్యులతో కేవ‌లం సంకేతాలో క‌మ్యూనికేట్ అయ్యేది. కొన్ని సంద‌ర్భాల్లో ఆమె పేపర్‌పై భారీ వ్యాఖ్యలు రాసి ఇచ్చేది. అయితే 2020లో ప్రధాని మోడీ..అయోధ్య మందిరం కోసం శంకుస్థాప‌న చేసిన నాటి నుంచి ఆమె రోజంతా మౌనంగా ఉండ‌డం ప్రారంభించింది. 1986లో భ‌ర్త దేవ‌కీనంద‌న్ అగ‌ర్వాల్ మృతి త‌ర్వాత స‌ర‌స్వతీ దేవి త‌న జీవితాన్ని రాముడికి అంకితం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories