శ్రీలంకలో ఆత్మహుతి దాడి మాపనే : ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ

శ్రీలంకలో ఆత్మహుతి దాడి మాపనే : ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ
x
Highlights

శ్రీలంకలో గత ఆదివారం, ఈస్టర్‌ పండుగనాడు బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటన...

శ్రీలంకలో గత ఆదివారం, ఈస్టర్‌ పండుగనాడు బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 321కి పెరిగింది. 'శ్రీలంకలో బాంబు దాడులు చేసినవారు మా కోసం పోరాడేవారే' అని ఐసిస్‌ అమఖ్‌ అనే వార్తా సంస్థకు తెలిపింది. ఈ దాడుల్లో గాయపడిన, చనిపోయిన వారి మొత్తం సంఖ్య దాదాపు వేయి అని పేర్కొంది. అమఖ్‌ వార్తా సంస్థ ఇస్లామిక్‌ రాజ్యస్థాపనకు, ఉగ్రవాదానికి మద్దతు ఉండేది. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదుల పేర్లను కూడా ఐసిస్‌ ప్రకటనలో వెల్లడించింది.

ఇదిలావుంటే ఓ డ్రైవర్ సహా మొత్తం 40 మంది అనుమానితులను శ్రీలంక పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. గత 24 గంటల్లో 16 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగం అధికార ప్రతినిధి రువాన్‌ గుణశేఖర మంగళవారం చెప్పారు. మళ్లీ వరుస బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికతో.. ఓ కంటెయినర్‌ ట్రక్కు, వ్యాన్‌ కోసం అక్కడి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ వాహనాలు పేలుడు పదార్థాలు మోసుకెళ్తున్నాయని అనుమానిస్తున్నారు. కొలంబోలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో హై అలర్ట్‌ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories