రన్‌వేపై అదుపు తప్పిన స్పైస్‌జెట్

రన్‌వేపై అదుపు తప్పిన స్పైస్‌జెట్
x
Highlights

స్పైస్‌జెట్‌కు చెందిన విమానం ముంబై ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే పై అదుపుతప్పింది. బోయింగ్‌ 737-800 రకానికి చెందిన ఈ విమానం జయపుర నుంచి...

స్పైస్‌జెట్‌కు చెందిన విమానం ముంబై ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే పై అదుపుతప్పింది. బోయింగ్‌ 737-800 రకానికి చెందిన ఈ విమానం జయపుర నుంచి ముంబయికి వస్తుండగా రన్ వేపై అదుపు తప్పింది. ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రధాన రన్‌వేను అధికారులు మూసి వేసి, ప్రత్యామ్నాయంగా ఉన్న మరో రన్‌వే పై రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ విమానాలను బెంగళూరు, అహ్మదాబాద్‌ వైపు మళ్లించారు. ముంబయిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories