ఎస్పీజీ భద్రత సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. మోడీకి కూడా..

ఎస్పీజీ భద్రత సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. మోడీకి కూడా..
x
అమిత్ షా
Highlights

మాజీలకు స్పెషల్ ప్రొటెక్షన్ కవరేజ్ ను తొలగిస్తూ సవరించిన బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. రాజ్యసభలో ఈ సవరణ బిల్లుకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్...

మాజీలకు స్పెషల్ ప్రొటెక్షన్ కవరేజ్ ను తొలగిస్తూ సవరించిన బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. రాజ్యసభలో ఈ సవరణ బిల్లుకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. గాంధీల కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపులో ఎలాంటి రాజకీయం లేదంటున్నారు హోం మంత్రి అమిత్ షా మాజీ ప్రధానులందరికీ ఎస్పీజీ భద్రత తొలగించామని, ప్రధాని మోడీకి కూడా అయిదేళ్ల తర్వాత ఇదే రూల్ వర్తిస్తుందని అమిత్ షా అన్నారు. గాంధీలకు స్పెషల్ ప్రొటెక్షన్ భద్రతను కావాలనే తొలగించారన్న ఆరోపణల నేపధ్యంలో అమిత్ షా స్పందించారు.

ప్రియాంకా గాంధీ ఇంటి దగ్గర భద్రతా పరమైన వైఫల్యం పై కూడా అమిత్ షా స్పందించారు. నవంబర్ 25న ప్రియాంక ఇంటికి రాహుల్ వస్తన్నట్లు వర్తమానం వచ్చిందని కానీ అందుకు భిన్నంగా అదే కారులో మీరట్ కాంగ్రెస్ లీడర్ శారదా త్యాగీ వచ్చారని ఇది యాధృచ్ఛికంగా, సమాచార లోపం వల్ల జరిగిన తప్పిదమే తప్ప ఇందులో ఎలాంటి కుట్ర లేదన్నారు. ఈ ఘటనపై ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామని ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించామనీ అమిత్ షా చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories