సంక్రాంతి రద్దీతో కిటకిటలాడుతోన్న రైల్వేస్టేషన్లు

సంక్రాంతి రద్దీతో కిటకిటలాడుతోన్న రైల్వేస్టేషన్లు
x
Highlights

సంక్రాంతి రద్దీతో నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దీన్ని దక్షిణ మధ్య రైల్వే కూడా క్యాష్ చేసుకుంటోంది.

సంక్రాంతి రద్దీతో నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దీన్ని దక్షిణ మధ్య రైల్వే కూడా క్యాష్ చేసుకుంటోంది.గత ఏడాది కంటే 80 శాతం అదనంగా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అయినా ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సులతో పాటు రైళ్లను ఆశ్రయిస్తారు. అయితే 6 నెలల క్రితం బుకింగ్స్ ఓపెనైన వెంటనే సంక్రాంతి సీజన్‌‌లోని రైళ్లన్ని వెయిటింగ్ లిస్టులోకి వెళ్లిపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

గత ఏడాది కంటే 80 శాతం అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. మొత్తం 431 స్పెషల్ ట్రైన్స్ ఈ సారి సంక్రాంతికి పట్టాలెక్కాయి. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని రూట్లలో స్పెషల్ ట్రైన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అదనపు ఛార్జీలు కూడా భారంగా మారాయి.అదనపు ట్రైన్లు ఏర్పాటు చేసినా అవి సరిపోవడం లేదని ప్రయాణికులంటున్నారు. చార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories