మోడీ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథులు

మోడీ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథులు
x
Highlights

పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి గుర్తింపు ఇవ్వడంలో బీజేపీ ప్రత్యేకతే వేరు అనిపించేలా చేయబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీ తో గెలిచినా...

పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి గుర్తింపు ఇవ్వడంలో బీజేపీ ప్రత్యేకతే వేరు అనిపించేలా చేయబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీ తో గెలిచినా ప్రధాని మోడీ రెండోసారి ప్రధానిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆహ్వానితులుగా బీజేపీ కార్యకర్తలు కుటుంబాలు హాజరు కానున్నారు. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబ సభ్యులు మోదీ ప్రమాణస్వీకారానికి రానున్నారనీ, వీరిని 'ప్రత్యేక ఆహ్వానితులు'గా పిలిచారనీ ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు 'ప్రత్యేక ఆహ్వానితుల' జాబితా ఖరారయింది. దీనిని ఇప్పటికే రాష్ట్రపతి భావం కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పశ్చిమ బెంగాల్ కార్యకర్తల కుటుంబాలకు బీజేపీ అధినాయకత్వం అండగా ఉంటుందని చెప్పేందుకే వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories