Monsoon: చల్లని కబురందించిన వరుణుడు..ఇక వానలే వానలు

Southwest monsoon hits Kerala
x

Monsoon: చల్లని కబురందించిన వరుణుడు..ఇక వానలే వానలు

Highlights

Monsoon: వరణుడు చల్లని కబురు అందించాడు. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతపవనాలు శనివారం కేరళాను తాకాయి. సాధారణంగా కంటే 8 రోజుల ముందే ఈ...

Monsoon: వరణుడు చల్లని కబురు అందించాడు. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతపవనాలు శనివారం కేరళాను తాకాయి. సాధారణంగా కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభావం వెల్లడించింది. మరో రెండు , మూడు రోజుల్లోనే ఇవి ఆంధ్రప్రదేశ్ లోకి విస్తరించే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం ముందుగానే నైరుతి వచ్చింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను 1975 నుంచి ఉన్న గణాంకాలను చూసినట్లయితే 1990లో ఇంకా ముందుగానే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది సాధారణ అంచనాల కంటే 1 3రోజుల ముందుగానే అంటే మే 19నే నైరుతి కేరళను తాకాయి.

ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. మన దేశంలో 52శాతం నికర సాగు భూమికి ఇప్పటికే వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుత రుతుపవనాలు కీలక పాత్రను పోషిస్తుంటాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపేందుకు దేశ జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories