భారీ సంఖ్యలో రైళ్ళు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

భారీ సంఖ్యలో రైళ్ళు  రద్దు చేసిన దక్షిణ మధ్య  రైల్వే
x
Highlights

దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో రైళ్ల రద్దు చేసింది. ఏడు రోజులపాటు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ముద్కేడ్ -పర్బాని మధ్య డబ్లింగ్ పనులు...

దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో రైళ్ల రద్దు చేసింది. ఏడు రోజులపాటు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ముద్కేడ్ -పర్బాని మధ్య డబ్లింగ్ పనులు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ప్యాసింజర్లను కోరింది.

దక్షిణ మధ్య రైల్వే 37 రైళ్లను పూర్తిగా, 33 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముద్కేడ్-పర్బని సెక్షన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రైళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ముద్కేడ్-పర్బని నడుమ 50 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు గత రెండు సంవత్సరాలుగా నడుస్తున్నాయి.. ప్రస్తుతం 85 శాతం మేర ఆ పనులు పూర్తయ్యాయి.. మిగతా పనులు పూర్తి కావాల్సి ఉంది..

ముద్కేడ్-పర్బని పనులు పూర్తి అయిన మార్గంలో లింకింగ్ పనులు నడుస్తున్నాయి. దీంతో శనివారం 13 రైళ్లను అధికారులు రద్దు చేసారు. ఇందులో ఏడు రైళ్లు శాశ్వతంగా, మరో తొమ్మిది రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. ఆదివారం మరో 18 రైళ్లు రద్దు కానున్నాయి. ఇందులో 10 రైళ్లు శాశ్వతంగా , మరో 8 రైళ్లు పాక్షికంగా రద్దు అవుతాయి.

ఈ నెల తొమ్మిదో తేది నుంచి 15 తేదీ వరకు అంటే వారం రోజుల పాటు రైళ్లు రద్దు కానున్నాయి. రద్దైన రైళ్ళలో హైదరాబాద్‌-ఔరంగాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, ఔరంగాబాద్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మేడ్చల్‌-హెచ్‌ఎస్‌, నాందేడ్‌-మేడ్చల్‌, ఆదిలాబాద్‌-పూర్ణ-ఆదిలాబాద్‌, నిజామాబాద్‌-పంధర్‌పూర్‌-నిజామాబాద్‌, తిరుపతి-అమరావతి-తిరుపతి, ఆదిలాబాద్‌-పర్లి-ఆదిలాబాద్‌ తదితర రైళ్లు రద్దైన జాబితాలో ఉన్నాయి.

ముద్కేడ్‌-పర్బని సెక్షన్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. రాత్రి పూట పనులు జరిగే అవకాశం లేకపోవడంతో కొన్ని దూర ప్రాంతాలు రైళ్లను నడుపుతారు. ఈ విషయాన్ని ప్రయాణికులు దృష్టిలో ఉంచుకొని ప్రత్యమ్నాయ మార్గాలను చూసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories