టెస్టు మ్యాచ్‌లా‌ లేదు.. పింక్ బాల్ టెస్టుపై గంగూలీ

టెస్టు మ్యాచ్‌లా‌ లేదు.. పింక్ బాల్ టెస్టుపై గంగూలీ
x
Sourav Ganguly
Highlights

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుపై భారత్ చారిత్రక టెస్టు మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుపై భారత్ చారిత్రక టెస్టు మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా పసికూన బంగ్లాపై ఘన విజయం సాధించింది. భారత్‌లో నిర్వహించిన తొలి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ విజయవంతం కావడంతో టీమిండియా మాజీ క్రికెటర్ బీసీసీ అధ్యక్షుడు గంగూలీ సంతోషం వ్యక్తం చేశారు. టెస్టుకు క్రికెట్ అభిమానుల నుంచి మద్దతు లభించింది.

ఈ సందర్భంగా స్పందించిన గంగూలీ డే/నైట్ టెస్టు సక్సెస్ ఫుల్ గా ముగిసింది. టెస్ట్ మ్యాచ్ వీక్షించేదుకు స్టేడియానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. డే/నైట్ టెస్టు చూస్టే టెస్టు మ్యాచ్ లా లేదని ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అన్న అనుభూతి కలిగిందన్నారు.

ఈ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను చూస్తే 2001లో టెస్టు మ్యాచ్ గుర్తుకు వచ్చిందని, ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచ్ ఇప్పటికీ మరిచిపోలేమని అన్నారు. ఈ మ్యాచ్ కూడా తనను గతంలోకి తీసుకెళ్లిందని అభిప్రాయపడ్డారు. భారత గడ్డపై భవిష్యత్తులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి బలమైన జట్లతో డే/నైట్ మ్యాచ్‌లాడితే ఆ కిక్ వేరని గంగూలీ వ్యాఖ్యానించాడు.

విండీస్ పర్యటనలో టెస్టు మ్యాచ్ లేవని, న్యూజిలాండ్ పర్యటనకు సంబంధించి డే/నైట్ మ్యాచ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గంగూలీ తెలిపారు. డే/నైట్ టెస్టు ఆరంభం మాత్రమేనని దీనిపై బోర్డులో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories