Sonu Sood Starts Sambhavam: అది సోనూ సూద్ కే 'సంభవం'

Sonu Sood Starts Sambhavam Programme to Give Scholarships to IAS Aspirants
x

Sonu Sood Starts Sambhavam Programme:(File Image)

Highlights

Sonu Sood Starts Sambhavam: ‘సంభవం’ను ప్రారంభిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉందిఅని సోనూసూద్ ట్వీట్ చేశారు.

Sonu Sood Starts Sambhavam: ఏ సాయం చేయాలన్నా.. ఎవరిని ఆదుకోవాలన్నా అది సోనూసూద్ కే సంభవం. అవును అడగందే అమ్మ అయినా పెట్టదనే సామెతను చెరిపేస్తూ అడగకుండానే సాయం అందిస్తున్న సోనూసూద్ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు భావి భారత పౌరులను సమర్ధవంతమైన అధికారులుగా తయారు చేసేందుకు తన వంతు బాధ్యతగా ముందుకొస్తున్నాడు.

కరోనా వేళ సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికో ఎంతో మందికి ఆర్థికంగా.. వైద్యపరంగా.. సాయం చేస్తున్న సోనూ సూద్.. ఇప్పుడు యువత కోసం అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కలలు కనే విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

సివిల్స్‌ కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసమే ప్రత్యేకంగా సంభవం అనే కార్యక్రమాన్ని తలపెట్టారు సోనుసూద్. దీని కింద పేద విద్యార్థులకు స్కాలర్‌షిఫ్‌లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఐఏఎస్‌కు సన్నద్ధమవుతున్నారా? ఐతే మీ బాధ్యత మేం తీసుకుంటాం. సంభవంను ప్రారంభిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉందిఅని సోనూసూద్ ట్వీట్ చేశారు. ఐఏఎస్ అభ్యర్థులు స్కాలర్‌షిప్స్ కోసం www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు జూన్ 30లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని సోనుసూద్ కోరారు.

ఇలా దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశానని సోనూసూద్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories