Opposition Meet: విపక్ష కూటమి కీలక బాధ్యతలు సోనియాకేనా..?

Sonia Gandhi is likely to be given key responsibilities in the opposition meeting
x

Opposition Meet: విపక్ష కూటమి కీలక బాధ్యతలు సోనియాకేనా..?

Highlights

Opposition Meet: నిన్నటి మీటింగ్‌లో కీలక నిర్ణయాలు

Opposition Meet: వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. బెంగళూరు వేదికగా విపక్షాలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నిన్న రాత్రి జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా.. విపక్షాల కూటమిలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా విపక్ష నేతలు తొలిరోజు సమాలోచనలు జరిపారు. నిన్న జరిగిన సమావేశంలో ప్రతిపక్షాల కూటమికి పేరును నిర్ణయించారు.విపక్షాల భేటీలో కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీకి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై నేటి సాయంత్రం ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్షాల నేతల సమావేశంలో కూటమి పేరును ఖరారు చేశారు. ప్రతిపక్షాల కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్ గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అధికారికంగా వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం ఒక్కటయ్యామని..రాబోయే రోజుల్లో కూటమి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఖర్గే. ఇక మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శనాస్త్రాలు సంధించారు ఖర్గే. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలంటే మోడీకి భయం పట్టుకుందని.. అందుకే.. సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు ఖర్గే.

Show Full Article
Print Article
Next Story
More Stories