శివసేనకు మద్దతిచ్చేందుకు సోనియా గ్రీన్ ‌సిగ్నల్‌

sonia gandhi
x
sonia gandhi
Highlights

శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు సహకరించాలంటూ మహారాష్ట్ర కాంగ్రెస్‌ను

రోజుకో మలుపు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కి వచ్చినట్లే కనిపిస్తున్నాయి. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు సహకరించాలంటూ మహారాష్ట్ర కాంగ్రెస్‌ను సోనియా ఆదేశించారు. ఇక, ఎన్సీపీ కూడా శివసేనకు సహకరించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అన్నీ అనుకున్నట్లే జరిగితే, నెలరోజులు మహాడ్రామాకు తెరపడి, డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చని అంటున్నారు.

అయితే, కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోన్న శివసేనకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి సర్కారు ఏర్పాటును 17మంది శివసేన ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, చర్చలు కొలిక్కి వస్తున్న సమయంలో 17మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం శివసేనకు తలనొప్పిగా మారింది. అయితే, శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.

ఇదిలా ఉంటే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ ప్రధాని మోడీని కలవడంతో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. శివసేనతో విసిగిపోయిన బీజేపీ ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుందంటూ ప్రచారం జరిగింది. పైగా, పవార్‌పై మోడీ ప్రశంసలు కురిపించిన తర్వాత ఈ భేటీ జరగడంతో రెండు పార్టీల దోస్తీపై పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. అయితే, తమ మధ్య రాజకీయ చర్చలు జరగలేదని, రైతాంగ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికే కలిసినట్లు పవర్ క్లారిటీ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories