ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియాగాంధీ, ప్రియాంక

AICC President Election: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక

Jyothi
Published on: 17 Oct 2022 12:13 PM IST
Sonia Gandhi And Priyanka Gandhi Casts His Vote in Delhi
X

ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియాగాంధీ, ప్రియాంక

AICC President Election: దేశవ్యాప్తంగా AICC అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. పిసిసి,. ఏఐసిసి కార్యాలయాల్లో ఓటింగ్‌ మొదలయ్యింది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాధ్రా ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 10గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత మాజీ మంత్రి పి.చిదంబరం తొలి ఓటు వేశారు. ఆ తర్వాత సీనియర్‌ నేతలు జైరామ్‌ రమేష్‌, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష బరిలో ఉన్న మల్లికార్జునఖర్గే బెంగళూరులో ఓటు వేయగా.. శశిథరూర్‌ కేరళ పిసిసి ఆఫీస్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4గంటల వరకు ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఈనెల 19న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Jyothi

Jyothi

Next Story