పాక్ దుశ్చర్య.. సైనికుడు మృతి

పాక్ దుశ్చర్య.. సైనికుడు మృతి
x
Highlights

కుక్కతోక వంకర పాకిస్థాన్ బుద్ధి రెండూ మారవు అన్నట్టు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా.. పాకిస్థాన్ మాత్రం భారత్ ను దొంగ దెబ్బ...

కుక్కతోక వంకర పాకిస్థాన్ బుద్ధి రెండూ మారవు అన్నట్టు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా.. పాకిస్థాన్ మాత్రం భారత్ ను దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ ప్రేరేపిత దాడుల్లో ఒక భారత సైనికుడు మరణించారు.. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ సరిహద్దు పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద జరిగింది. పాకిస్తాన్ దుశ్చర్యకు ఒక సైనికుడు మరణించాడని అలాగే మరో నలుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

సైనికుడిని నాయక్ రాజీవ్ సింగ్ షేఖావత్ (36) గా గుర్తించిన డిఫెన్స్ ప్రో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ మాట్లాడుతూ.. మృతిచెందిన సైనికుడు రాజస్థాన్ జైపూర్ జిల్లాలోని లుహ్కానా కుర్ద్ గ్రామానికి చెందినవాడని చెప్పారు. ఆయనకు భార్య ఉషా ఉన్నారన్నారు.

లెఫ్టినెంట్ కల్నల్ ఆనంద్ మాట్లాడుతూ.. షేఖావత్ చాలా ధైర్యవంతుడని కొనియాడారు.. అతను చేసిన అత్యున్నత త్యాగం దేశం గుర్తుంచుకుంటుందని అన్నారు. అయితే పాకిస్థాన్ చర్యకు మన సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకుంది.. ముగ్గురు పాకిస్తాన్ సైనికులను చంపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. దీంతో సరిహద్దు షెల్లింగ్ శనివారం అర్థరాత్రి ఆగిపోయిందని వారు తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం, బాలాకోట్ మరియు మెన్ధార్ ప్రాంతాలలో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ దళాలు చిన్న ఆయుధాలతో ప్రేరేపిత దాడులు చేశాయి. మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్లు డిఫెన్స్ ప్రో తెలిపింది.

ఇదిలావుంటే అనుమానిత ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ కాంట్రాక్టర్‌ను కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. త్రాల్ ప్రాంతంలో నివసిస్తున్న గులాం నబీని ఆయన ఇంటి బయట కాల్చి చంపినట్టు అధికారులు తెలిపారు.

నబీ వయసు 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. 'ఆయన బులెట్ గాయాలతో మరణించాడు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్' అని అవంతిపోర పోలీసు సూపరింటెండెంట్ తాహిర్ సలీమ్ చెప్పారు. దాడి గురించి తెలుసుకొని నబీని స్థానిక ఆసుపత్రికి తరలించామని, కానీ అక్కడి వైద్యులు అతన్ని చనిపోయినట్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు. కాగా అతన్ని చంపడం కోసం ఉగ్రవాదులు పిస్టల్ ఉపయోగించారని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories