Snowfall: ఉత్తరాదిని కప్పేసిన మంచు దుప్పటి

Snowfall in Jammu And Kashmir And Himachal Pradesh
x

Snowfall: ఉత్తరాదిని కప్పేసిన మంచు దుప్పటి

Highlights

Snowfall: జమ్మూకశ్మీర్, హిమాచల్‌లో మంచు వర్షం

Snowfall: ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. శీతాకాలం ప్రారంభం కావడంతో జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఫ్రెష్‌గా మంచు వర్షం కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్, కుప్వారా ప్రాంతంలోని మిచిల్‌ సెక్టార్‌ లో భారీగా మంచు పడుతోంది. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌ లోనూ భారీగా మంచు కురుస్తోంది. కోక్సార్‌ ప్రాంతంలో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలన్నీ కనుచూపు మేర శ్వేతవర్ణం సంతరించుకున్నాయి. చెట్లు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు రహదారులు మంచుతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories