యాక్షన్ సినిమాను మించిన దొంగతనం

యాక్షన్ సినిమాను మించిన దొంగతనం
x
మొబైల్ దొంగతనం
Highlights

దొంగలు కొత్త పద్ధతిని అవలంభిస్తున్నారు. రైళ్ళలో కిటీకి పక్కన కూర్చున్న వారి నుంచి, గేటు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడే వారి దగ్గర నుంచి ఫోన్ లాక్కొని పోతున్నారు

దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. ట్రెండ్ మార్చి మరి దొంగతనాలు చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లలోనో, లేక జేబులో పెట్టుకున్న మనీపరసునో కొట్టేడం అదంతా పాత ట్రెండ్ లా అనిపించి ఉంటుంది. ఇప్పుడు దొంగలు కొత్త పద్ధతిని అవలంభిస్తున్నారు. రైళ్ళలో కిటీకి పక్కన కూర్చున్న వారి నుంచి, గేటు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడే వారి దగ్గర నుంచి ఫోన్ లాక్కొని పోతున్నారు. అదిలా ఎలా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు చూద్దాం..

చెన్నై నుంచి నెల్లూరు తమిళనాడులోకి పలు ప్రాంతాలకు మెమొ రైళ్లు నిత్యం తిరుగుతుంటాయి. వేలాది మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. ఈ మధ్య కాలంలో చెన్నై సదరన్ డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాలకు వెళ్లే మెమో రైళ్లలో సెల్ ఫోన్ దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో కీటికీ వద్ద కూర్చున్న వ్యక్తి నుంచి జేబుల్లో నుంచి లేదా వారు మాట్లాడుతున్న సమయంలో వారి నుంచి మొబైల్ కొట్టేయడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తమిళనాడు చెన్నై డివిజన్ పరిధిలో బయలుదేరిన రైలులో బోగి అంచున నిలబడి మాట్లాడుతూన్న వ్యక్తి మొబైల్ దొంగిలించిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొహానికి కచ్ఛిఫ్ చూట్టుకుని రైలు బయలుదేరిన సమయంలో గేటు దర్గర మాట్లాడుతున్న వ్యక్తి నుంచి మొబైల్ కొట్టేసి ఫ్లాట్ గొడ దూకి పరిపోతున్న దృశ్యాలు రికార్దైయ్యియి. యాక్షన్ సినిమాను మించి మరి ఓ దొంగ చూపిన లాఘావం జనాన్ని షాక్ గురిచేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories