Corona Effect: భారత్ లో ఐఫోన్‌ ప్రియులకు షాక్..

Corona Effect: భారత్ లో ఐఫోన్‌ ప్రియులకు షాక్..
x
IPHONE
Highlights

భారత్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్‌ ఫోన్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.

భారత్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్‌ ఫోన్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సవరించిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చాయి. కరోనా సంక్షోభంతో జీఎస్టీ 12 నుంచి గతంలో ఉన్నట్టుగానే 18 శాతానికి పెరగడమం, దానికి తోడు కేంద్ర బడ్జెట్ 2020 లో దిగుమతి సుంకంలో మార్పులు.. వంటి కారణాలతో రేట్లు పెరిగినట్టు తెలుస్తోంది. 64 జీబీ ఐఫోన్‌ 11 ధర రూ.64,900 నుంచి రూ.68,300లకు చేరింది.

64 జీబీ ఎక్స్‌ఆర్‌ మోడల్‌ రూ.2,600 పెరిగి రూ.52,500లకు చేరింది. ఇక రూ.1,01,200 64 జీబీ 11 ప్రో ధర.. రూ.1,06,600 కు పెరిగింది. 64 జీబీ 11 ప్రో మ్యాక్స్‌ రూ.1,11,200 నుంచి రూ.1,17,100కు చేరుకుంది. ఇక 32 జీబీ ఐఫోన్‌ 7 రూ.1,600 పెరిగి రూ.31,500లుగా ఉంది. జీఎస్టీ పెంపుతో కస్టమర్ల పై రూ.15,000 కోట్ల భారం పడుతుందని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ అంచనా వేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories