logo
జాతీయం

ఈసారి వ‌ర్షాలు.. సాధార‌ణం క‌న్నా త‌క్కువే !

ఈసారి వ‌ర్షాలు.. సాధార‌ణం క‌న్నా త‌క్కువే !
X
Highlights

అసలే కొంతకాలంగా సకాలంలో వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ సంస్థ చేదువార్త అందించింది. ఎల్ నినో...

అసలే కొంతకాలంగా సకాలంలో వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ సంస్థ చేదువార్త అందించింది. ఎల్ నినో ప్ర‌భావంతో ఈసారి వ‌ర్షాలు సాధార‌ణం క‌న్నా త‌క్కువే ఉంటాయ‌ని స్కైమెట్ వాతావ‌ర‌ణ సంస్థ వెల్ల‌డించింది. ప్ర‌తి ఏడాది జూన్‌లో ఈశాన్య రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లో ప్రవేశించి.. ఆ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా విస్తరిస్తాయి.

లాంగ్ పీరియ‌డ్ రేంజ్‌(ఎల్‌పీఏ)లో రుతుప‌వ‌నాల ప్ర‌భావం 93 శాతం ఉంటుంద‌ని మెట్ వాతావ‌ర‌ణ సంస్థ అంచ‌నా వేసింది. వ‌ర్ష‌పాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది బిలో నార్మ‌ల్ రేంజ్ అవుతుందని వెల్లడించింది. 1951 నుంచి 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఎల్‌పీఏ వ‌ర్ష‌పాతం స‌గ‌టున‌ 89 సెంటీమీట‌ర్లు ఉందని. దీంతో ఎల్ నినో ప్ర‌భావం ఉంటుందని.. ఎల్ నినో ఏర్పడటం వ‌ల్లే వ‌ర్ష‌పాతం ఈసారి నార్మ‌ల్ క‌న్నా త‌క్కువ‌గా ఉంటుందని తెలిపింది.

Next Story