Top
logo

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం : ఆరుగురు మృతి

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం : ఆరుగురు మృతిroad accident in Chennai
Highlights

నెల రోజుల వ్యవధిలోనే తమిళనాడులో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్‌ను కారు ఢీ కొట్టింది.. దీంతో ఆరుగురు విద్యార్థులు మరణించారు.

నెల రోజుల వ్యవధిలోనే తమిళనాడులో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్‌ను కారు ఢీ కొట్టింది.. దీంతో ఆరుగురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటన గురువారం తిరువూరు జిల్లాలో జరిగింది. తిరువూరు సమీపంలో ఓ కారు ప్రయాణికులతో వేగంగా వెళుతోంది.. ఈ క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. దాంతో పెను ప్రమాదం జరిగింది. కారులో ఉన్న నలుగురు ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్టు తెలుస్తోంది.

ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మెడికల్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. వారి కుటుంబ సబ్యులకు సమాచారం అందించారు. కాగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అతివేగం కారణంగా కారు అదుపుతప్పినట్టు భావిస్తున్నారు.


Web Titlesix people died in road accident Chennai
Next Story