National News: విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు స్పాట్ డెడ్!

National News
x

National News: విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు స్పాట్ డెడ్!

Highlights

National News: హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ల్యాండ్‌స్లైడ్‌లో ఆరుగురు మరణించారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

National News: హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో మణికరణ సాహిబ్ గుడ్వారా సమీపంలో ఆదివారం సాయంత్రం భయానక ల్యాండ్‌స్లైడ్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, పలువురు గాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండటం మరింత విషాదకరం. ఈ ఘోరం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది. రోడ్డుపక్కన కూర్చొని ఉన్నవారిపై పెద్ద చెట్టు ఒకటి కొండచరియలతో కలిసి పడిపోవడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే జారి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విషాదాన్ని దగ్గరగా చూసిన స్థానికుల కథనం ప్రకారం, ప్రమాద సమయంలో ఒక స్ట్రీట్ హాకర్‌, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి, మూడు మంది పర్యాటకులు అక్కడే ఉండగా వారు మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో రోడ్డు పక్కన ఉన్న వారికి పొరపాటుగా ఈ ప్రకృతి ప్రకోపం ఎదురై ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

కుల్లు అదనపు జిల్లా కలెక్టర్ అశ్వని కుమార్ తెలిపారు ప్రకారం, మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ధృవీకరించారు. ఇంకా పలువురికి గాయాలైనట్లు, పరిస్థితి పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. మణికరణ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ నేతృత్వంలో పోలీసు బృందం అక్కడే ఉంది. సహాయక చర్యలు, రక్షణ చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక ఘటన స్థలాన్ని మూసివేశారు. పర్యాటక ప్రదేశం కావడంతో అక్కడ వర్తకులు, పర్యాటకులు ఎక్కువగా ఉండటంతో ఆ సమయంలో వందలాది మంది గమనం సాగించినట్టు సమాచారం. అధికారులు సహాయ చర్యలను వేగవంతం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, పోలీసుల సహకారంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అటు ఈ ఘటన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు రేకెత్తించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories