Delhi: ఉప్పెనలా ముంచుకొచ్చిన కరోనా ముప్పు

Situation Criticle in New Delhi
x

Delhi:(File Image)

Highlights

Delhi: కొవిడ్‌ ఉద్ధృతి దేశంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఆక్సిజన్ కోసం ఒక్కో బెడ్ పై ఇద్దరు పేషెంట్లు

Delhi: భారత దేశాన్ని కరోనా ఉప్పెనలా ముంచేస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా కరోనా రోగులతో ఆసుప్రతులు నిండి పోతున్నాయి. ఇటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులు అనే తేడా లేకుండా కరోనా రోగులతో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రను చుట్టేసిన కరోనా దేశ రాజధానిని కరోనా ఎలా వణికిస్తోంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి (ఎల్ఎన్జేపీ)ని సందర్శిస్తే చాలు. ఇక్కడ దాదాపు 1,500కు పైగా పడకలు రోగులకు స్వస్థత చేకూర్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ నిండిపోయాయి. ఎంతలా అంటే, ఆక్సిజన్ కోసం ఒక్కో బెడ్ పై ఇద్దరికి చొప్పున స్థానం కల్పించాల్సి వస్తోంది. ఆసుపత్రి అంబులెన్స్ లు రోజుకు వందల మందిని తీసుకుని వస్తుండటమే పరిస్థితి విషమించడానికి కారణమైంది.

ఈ సంవత్సరం ఆరంభంలో రోజుకు 10 వేల వరకూ ఉన్న రోజువారీ కేసుల సంఖ్య, ఇప్పుడు 2 లక్షల మార్క్ ను అధిగమించింది. అధికారిక గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని మరే దేశంలోనూ ఒక్క రోజులో రెండు లక్షలకు పైగా కేసులు నమోదు కాలేదు. ఇండియాలోని అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రుల్లో ఎల్ఎన్జేపీ కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. కరోనా సోకిన వారు ఇక్కడికి కేవలం అంబులెన్స్ లలో మాత్రమే కాదు... బస్సుల్లోనూ, ఆటో రిక్షాల్లోనూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న కరోనా రోగుల్లో అప్పుడే పుట్టిన చిన్నారి కూడా ఉండటం గమనార్హం.

"మాపై ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది. ఆసుపత్రి మొత్తం సామర్థ్యానికి మించి నిండిపోయింది" అని ఎల్ఎన్జేపీ మెడికల్ డైరెక్టర్ సురేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరోనా సోకి క్రిటికల్ గా ఉన్న వారి కోసం ఇప్పుడు 300 పడకలు కేటాయించినా, అవి సరిపోవడం లేదని ఆయన అన్నారు. ఒకరికి ఒకరు ఏ మాత్రమూ సంబంధం లేని పేషంట్లు పడకలను పంచుకోవాల్సి వస్తోందని, కరోనాతో మరణించిన వారిని మార్చురీలో ప్లేస్ లేక, వార్డు బయటే ఉంచి, అటునుంచి అటే శ్మశానానికి పంపాల్సి వస్తోందని వాపోయారు. ఒక్కరోజులో ఆసుపత్రిలో 158 మందిని చేర్చుకోవాల్సి వచ్చిందని, వారంతా పరిస్థితి విషమించిన వారేనని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ 'టీకా ఉత్సవ్‌'కు పిలుపులో భాగంగా ఈ నెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల్లో కలిపి కోటికిపైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఏప్రిల్‌ 11న 29,33,418 డోసులు పంపిణీ జరిగింది. ఏప్రిల్‌ 12న 40 లక్షలు, 13న 26 లక్షలు, 14న 33 లక్షల డోసులు చొప్పున పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో అర్హులైన ప్రజలందరికీ మొత్తంగా 1,28,98,314 డోసుల టీకాను పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories