సొమ్ముతో వచ్చిన సోకు..నలుగురికోసం విమానమే బుక్ చేశారు!

సొమ్ముతో వచ్చిన సోకు..నలుగురికోసం విమానమే బుక్ చేశారు!
x
Highlights

సోమ్ములుంటే ఏదైనా దొరుకుతుంది. కరోనా ఉన్నా.. మరోటి ఉన్నా సోమ్మున్నవాడి సోకే వేరు. ఇదిగో ఈ విషయం చదివితే మీకు ఇది అర్థం అవుతుంది. కేవలం నలుగురి కోసం...

సోమ్ములుంటే ఏదైనా దొరుకుతుంది. కరోనా ఉన్నా.. మరోటి ఉన్నా సోమ్మున్నవాడి సోకే వేరు. ఇదిగో ఈ విషయం చదివితే మీకు ఇది అర్థం అవుతుంది. కేవలం నలుగురి కోసం విమానం అంతా బుక్ చేసుకుని ప్రయాణించారు.

అసలే కరోనావైరస్ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో దేశీయ విమానాలు అతి పరిమితంగా తిరుగుతున్నాయి.. ఈ తరుణంలో ఓ వ్యక్తి తన కుటుంబసభ్యుల కోసం ఏకంగా మొత్తం విమానాన్నే బుక్‌ చేసుకున్నాడు.. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. భోపాల్‌కు చెందిన లిక్కర్‌ క్రాంట్రాక్టర్ కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు లాక్‌డౌన్‌కు ముందు ఢిల్లీ నుంచి భోపాల్‌ వచ్చారు.. దాంతో వారు అక్కడే ఉండిపోయారు.

అయితే ఇటీవలే పరిమితమైన దేశీయ విమాన సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆ వ్యాపారి దొరికిందే దక్కుదల అనుకున్నాడో ఏమో ఏకంగా 180 సీట్ల ఏ320 విమానాన్ని బుకింగ్‌ చేసుకున్నాడు. ఆ విమానం గత సోమవారం ఢిల్లీ నుంచి భోపాల్‌ విమానాశ్రయానికి కేవలం విమాన సిబ్బందితో మాత్రమే వచ్చి ఆ వ్యాపారవేత్త కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలుతో పాటు పనిమనిషిని ఎక్కించుకుని ఢిల్లీలో దిగబెట్టింది. కాగా ఎయిర్‌బస్‌ 320 తరహా విమానాన్ని బుక్‌ చేసుకోవాలంటే సుమారు రూ. 20 లక్షలకు పైగా ఖర్చవుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories