Virus Variant: ట్విట్టర్, ఫేస్ బుక్ లకు సింగపూర్ వార్నింగ్

Singapore Orders Facebook and Twitter to Issue correction on Virus Variant
x
అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Singapore: కొత్త వైరస్ వేరియంట్ లేదని స్పష్టం చేయడంటూ ట్విటర్, ఫేస్ బుక్ లకు సింగపూర్ ప్రభుత్వ ఆదేశించింది

Singapore: కరోనాపై ఆ దేశం ఎంత సీరియస్ గా ఉంటుందో తెలియాలంటే ఇదొక్క ఎఫిసోడ్ చాలు. సింగపూర్.. రూల్స్ చాలా కఠినంగా ఉంటాయని చెప్పుకునే ఆ దేశం.. ఒకే ఒక్క ట్వీట్ పై చాలా సీరియస్ అయిపోయింది. కేజ్రీవాల్ సింగపూర్ లో ప్రమాదకరమైన కరోనా వేరియెంట్ ఉందని.. అందుకని వెంటనే ఆ దేశానికి రాకపోకలు నిలిపివేయాలంటూ కేంద్రానికి చెబుతూ ట్వీట్ చేశారు. అంతే సింగపూర్ భగ్గుమంది. ఆ వెంటనే కేంద్రం కూల్ చేయాలని చూసింది. అసలు ఇండియాకు ఆక్సిజన్, మందులు అన్నిటిలోనూ మేం అంత సాయం చేస్తుంటే మమ్మల్నిఇలా బద్ నామ్ చేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది.

కేంద్రం ఎంటరై సారీ చెప్పినంత పని చేసింది. సారీ తప్ప అన్నీ చెప్పింది. అంతటితో ఆ ఎపిసోడ్ అయిపోయిందనే అందరూ అనుకున్నారు. కాని అవతల ఎవరు సింగపూర్ అందుకే కేజ్రీవాల్ ట్వీట్ పెట్టిన ట్విట్టర్.. అది పోస్ట్ చేసిన ఫేస్ బుక్ రెండిటికి సింగపూర్ అల్టిమేట్ ఇచ్చింది. కేజ్రీవాల్ చెప్పింది తప్పు.. కొత్త వేరియెంట్ ఏదీ సింగపూర్ లో రాలేదని నెటిజన్లకు క్లారిటీ ఇవ్వాల్సిందేనని ఆర్డర్ చేసింది. అదీ సింగపూర్.

ఇప్పుడు సింగపూర్ ఆదేశాలను పాటించడం ఎలా అని ట్విట్టర్ ఫేస్ బుక్ తలలు పట్టుకుంటున్నాయి. ఇవతల కేజ్రీవాల్ చాలా క్రేజీ లీడర్. ఆయన చెప్పింది తప్పని నిరూపించలేరు.. అలా అని కరెక్టే అని సింగపూర్ కి ఎదురు చెప్పలేరు. మరేం చేస్తారో కొన్ని గంటలు వెయిట్ చేసి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories