యూనిఫారం తీసి రోడ్డుపై పరుగులు పెట్టిన ఎస్సై... వెంబడించిన ఏసీబీ...

SI Tried to Escape from ACB Officials for Taking Bribe on Vehicle in Karnataka
x

యూనిఫారం తీసి రోడ్డుపై పరుగులు పెట్టిన ఎస్సై... వెంబడించిన ఏసీబీ...

Highlights

Karnataka: సీజ్ చేసిన వాహనాన్ని వదిలిపెట్టేందుకు రూ.28వేలు లంచం డిమాండ్...

Karnataka: తనను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలిసి ఆ ఎస్సై తన యూనిఫాం తీసేసి మరీ రోడ్డుపై పరుగులు పెట్టాడు. కిలోమీటరు పాటు వెంబడించిన అధికారులు ఎట్టకేలకు అతడిని పట్టుకుని అరదండాలు వేశారు. కర్ణాటకలోని తుముకూరులో జరిగిందీ ఘటన.

తుముకూరు గుబ్బిన్ తాలూకాలోని చంద్రశేఖర్ పొరా పోలీసులు.. ఓ కేసులో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో 28 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ డబ్బును తీసుకుని ఆ వాహనాన్ని విడిచిపెట్టాలని ఎస్సై సోమశేఖర్ కానిస్టేబుల్‌ నయాజ్ అహ్మద్‌కు చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు చంద్రన్న. ఇక ఎస్సై కోసం వారు కాపుకాశారు.

ఈ క్రమంలో 12 వేల రూపాయలు తీసుకుంటున్న కానిస్టేబుల్‌ను బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై తీసుకోమంటేనే తాను లంచం తీసుకున్నానని కానిస్టేబుల్ చెప్పడంతో అతడితో కలిసి స్టేషన్‌కు బయలుదేరారు. ఏసీబీ అధికారులు తన కోసం వస్తున్నారని గుర్తించిన ఎస్సై తన యూనిఫాం చొక్కాను అక్కడి చెత్తబుట్టలో పడేసి స్టేషన్ నుంచి బయటకు వచ్చి పరుగులు తీశాడు.

అదే సమయంలో అక్కడికి చేరుకున్న అధికారులు అతడిని వెంబడించారు. అలా దాదాపు కిలోమీటరు దూరం అతడి వెనక పరుగులు తీశారు. చివరికి స్థానికుల సాయంతో ఎస్సై సోమశేఖర్‌ను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories