Shubhanshu Shukla: ప్రధాని మోడీని కలిసిన వ్యోమగామి… అంతరిక్షం నుంచి భూమి చిత్రాలు, త్రివర్ణ పతాకం బహూకరణ

భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన అధికారిక నివాసమైన 7 లోక్‌కళ్యాణ్ మార్గ్ వద్ద కలిశారు. ఈ సందర్భంగా, తన చారిత్రాత్మక ఆక్సియం-4 మిషన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకాన్ని ప్రధానికి బహూకరించారు. అంతరిక్షం నుంచి తీసిన భూమి అద్భుత చిత్రాలను కూడా అందజేశారు.

Ramya Vegirouthu
Published on: 18 Aug 2025 10:06 PM IST
Shubhanshu Shukla: ప్రధాని మోడీని కలిసిన వ్యోమగామి… అంతరిక్షం నుంచి భూమి చిత్రాలు, త్రివర్ణ పతాకం బహూకరణ
X

ప్రధాని మోడీ, శుభాన్షును హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అంతరిక్ష ప్రయాణం సందర్భంగా ఎదురైన సవాళ్లు, నిర్వహించిన శాస్త్రీయ ప్రయోగాల వివరాలు శుభాన్షు మోడీతో పంచుకున్నారు. ముఖ్యంగా మానవ శరీరంపై సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాలు, అంతరిక్షంలో వ్యవసాయం కోసం వాడే ఆధునిక సాంకేతికతలపై చేసిన పరిశోధనలు భారత గగన్‌యాన్ కార్యక్రమానికి కీలకంగా నిలుస్తాయని ప్రధాని అభినందించారు.

జూన్‌లో ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లా ISSకి చేరుకున్నారు. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా గుర్తింపు పొందారు. జూలై 16న మిషన్ పూర్తి చేసి భూమికి సురక్షితంగా చేరుకున్నారు. అంతేకాకుండా, సోమవారం పార్లమెంటులో కూడా శుభాన్షు శుక్లా చేసిన AX-4 మిషన్ విజయాన్ని ప్రశంసిస్తూ సభ అభినందనలు తెలిపింది.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story