ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌గా ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ

ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌గా ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ
x
శ్రీవాస్తవ (ఫైల్ ఫోటో)
Highlights

ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్‌ శనివారం పదవీవిరమణ చేయనున్నారు.

ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్‌ శనివారం పదవీవిరమణ చేయనున్నారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో అమూల్య విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమితులైన శ్రీవాస్తవకు దేశ రాజధాని గురించి బాగా తెలుసు. అల్లర్లకు గురైన ప్రాంతాల పరిస్థితిని సమీక్షించడానికి శ్రీవాస్తవ గురువారం ఈశాన్య ఢిల్లీ లోని పలు ప్రాంతాలను సందర్శించారు.

ఈ సంధర్బంగా జాతీయ రాజధాని సాధారణ స్థితికి చేరుతోందని, ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నారని ఆయన మీడియాకు చెప్పారు. కాగా సీఆర్‌పీఎఫ్‌ నుంచి స్పెషల్‌ కమిషనర్‌ (శాంతిభద్రతలు)గా హోంమంత్రిత్వ శాఖ శ్రీవాస్తవను తీసుకొచ్చిన కొద్దిరోజులకే ఆయనకు ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌ బాధ్యతల్లో నియమించడం చర్చనీయాంశషంగా మారింది. శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని దేశ రాజధాని మరియు చుట్టుపక్కల మరియు దేశంలోని అనేక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదిలావుంటే ఢిల్లీలో హింస కారణంగా ప్రభావిత ప్రాంతాలలో ఫిబ్రవరి 28, 29 జరిగబోయే పదో తరగతి పరీక్షలను సిబియస్‌ఈ బోర్డు వాయిదా వేసింది. మార్చి 2 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలలో ఎటువంటి మార్పు ఉండదని బోర్డు అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుండి బుధవారం తెల్లవారుజామున పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇందులో మరణించిన వారి సంఖ్య 38 కి చేరుకోగా, 200 మందికి పైగా గాయపడ్డారని మీడియా నివేదికలు తెలిపాయి. అందులో 45 మంది పోలీసులు కూడా ఉన్నారు. వారిలో కొందరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు ఢిల్లీలో పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.. బుధవారం జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్‌ పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు దేశ రాజధానిలో హింసాకాండకు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించాయి మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories