అమూల్యను చంపితే రూ.10 లక్షల నజరానా అంటూ శ్రీరామ్ సేన ప్రకటన

అమూల్యను చంపితే రూ.10 లక్షల నజరానా అంటూ శ్రీరామ్ సేన ప్రకటన
x
Highlights

బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ బహిరంగసభ నిర్వహించిన సంగతి తెలిసిందే.

బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ బహిరంగసభ నిర్వహించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సభలో అమూల్య లియోని అనే యువతి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసి వార్తల్లో నిలిచారు. ఆమె వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అమూల్య వ్యాఖ్యలపై శ్రీరామసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను చంపితే రూ.10 లక్షల నజరానా ఇస్తామంటూ శ్రీరామసేన కార్యకర్త సంజీవ్‌ మరాడి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అమూల్య జైలు నుంచి విడుదల చేయకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇలా కాకుండా ఆమెను జైలు నుంచి విడుదల చేసినా కాల్చి చంపుతామని హెచ్చరించారు. దీంతో మానవహక్కుల సంఘాలు ఈ హెచ్చరికలపట్ల తీవ్రంగా మండిపడ్డారు. మహిళపట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంజీవ్ మరాడీపై బళ్లారి ఎస్పీ సి.కె.బాబాకు ఫిర్యాదు చేశాయి. తాను ఆ వీడియోను చూడలేదని, చూసిన తర్వాత స్పందిస్తానని ఎస్పీ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 124ఏ కింద అమూల్యపై దేశద్రోహం కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. అమూల్యను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించి, శుక్రవారం ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

ఇదిలావుంటే అమూల్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల ఆమె తండ్రి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎంత చెప్పినా వినకుండా కొంతమంది ముస్లిం లతో చేరి ఈ వ్యాఖ్యలు చేసిందని.. బెయిల్ కోసం కూడా ప్రయత్నించానని చెప్పారు ఆమె తండ్రి. అయితే దురదృష్టవశాత్తు చిక్కమంగళూరులోని ఆమె తండ్రి ఇంటిపై కొందరు యువకులు దాడి చేశారు. దీంతో వారిపైనా కేసులు నమోదు చేశారు పోలీసులు.

కాగా సీఏఏ వ్యతిరేక సభలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. 'పాకిస్థాన్ జిందాబాద్' అని నినాదాలు చేసిన ఆమెను ఓవైసీ తోపాటు పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె ఆగలేదు.. నినాదాలు చేస్తూనే ఉంది. చివరికి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ అమ్మాయి అముల్య బెంగళూరులోని ఎన్‌ఎంకెఆర్‌వి కళాశాల విద్యార్థి. అమూల్య ఇక్కడ నుండి జర్నలిజంలో బిఎ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories