Chardham Yatra 2024: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం.. తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం


Chardham Yatra 2024: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం.. తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం
Chardham Yatra 2024: హిమగిరులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది.
Chardham Yatra 2024: హిమగిరులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది. పూజలు, వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆలయ తలుపులను తెరిచారు అర్చకులు. ఈ సందర్భంగా చేసిన ప్రత్యేక పూజల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆలయం తెరిచే సందర్భంగా భారత ఆర్మీ ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రత్యేక పూజల సందర్భంగా హెలికాప్టర్ ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు.
#WATCH | Rudraprayag, Uttarakhand: Huge crowd of devotees from all over the country gather at Shri Kedarnath Dham as the temple portal opens on the occasion of Akshaya Tritiya. pic.twitter.com/q6eUbCjrLZ
— ANI (@ANI) May 10, 2024
ఇక ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ఏటా అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర.. ఆరు నెలల పాటు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయ శ్రేణుల్లో ఉండే గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల సందర్శనను చార్‌ధామ్ యాత్రగా పిలుస్తారు. దీపావళి మర్నాడు కార్తీకమాసం రోజున మూసివేసే ఈ నాలుగు ఆలయాలను.. అక్షయ తృతీయ రోజున తెరుస్తారు. శీతాకాలంలో మంచు కారణంగా మూసి ఉండే ఈ ఆలయాలను దర్శించుకోడానికి భక్తులను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల తర్వాత అశేష భక్తుల సందర్శనార్ధం కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి శుక్రవారం తెరుచుకున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



