ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు.. ఒకరు మృతి..

ఆప్ ఎమ్మెల్యే  కాన్వాయ్‌పై కాల్పులు.. ఒకరు మృతి..
x
Highlights

ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే...

ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరపడంతో ఆప్ కార్యకర్త ఒకరు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. కాగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

అందులో.. "ఆప్ ఎమ్మెల్యే లాంల నరేష్ యాదవ్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాలంటీర్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాల కారణంగా ఒక వాలంటీర్ కన్నుమూశారు. మరొకరికి గాయాలయ్యాయి "అని ఆప్ తన ట్వీట్‌లో పేర్కొంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే తన మద్దతుదారులతో కలిసి తన నియోజకవర్గంలోని ఒక ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

మెహ్రౌలీ ఎమ్మెల్యే కాన్వాయ్ వద్ద మొత్తం ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ సంఘటనలో గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు.ఈ దాడిలో ఢిల్లీకి చెందిన పార్టీ వాలంటీర్ అశోక్ మన్ అనే వ్యక్తి మృతి చెందినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఆప్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ అంకిత్ లాల్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. కాగా ఈ ఘటనపై ఒక్కసారిగా ఢిల్లీలో అలజడి నెలకొంది. ఇప్పటికే పౌరసత్వ బిల్లు విషయంలో రోజుకో ఆందోళన జరుగుతున్న సమయంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం సంచలంగా మారింది. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు. నిందితున్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈ విషయంపై ఆరా తీశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories