తమిళనాడులో 36 సెంటీమీటర్ల ఎత్తు లేగదూడ జననం

Shortest Calf Born In Cuddalore District Tamil Nadu
x

 పొట్టి లేగదూడ జననం (ట్విట్టర్ ఫోటో)

Highlights

* తమిళనాడు కడలూరు జిల్లా నలపుత్తూరులో పొట్టి లేగదూడ జననం * మూడు రోజుల క్రితం జన్మించిన లేగదూడ

Tamil Nadu: తమిళనాడులోని కడలూరు జిల్లా నలపుత్తూరులో కేవలం 36 సెంటీమీటర్ల ఎత్తులో జన్మించిన అతి పొట్టి లేగ దూడ స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. నలనుత్తూరుకు చెందిన విజయన్‌కు చెందిన ఆవు ఇప్పటికే రెండు దూడలకు జన్మనిచ్చింది. అవి సాధారణ ఎత్తులోనే ఉండగా, ఈ దఫా ఈ ఆవుకు జెర్సీ జాతికి చెందిన ఎద్దుల నుంచి సేకరించిన స్పెర్మ్ ఇంజక్షన్ వేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం జన్మించిన లేగదూడ ఎత్తు కేవలం 36 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. దానికి తల్లి పొదుగు అందక ఇబ్బందిపడుతోంది. పాలు తాగ లేక, ఆకలికి తట్టుకోలేక అల్లాడిపోతోంది. దూడ ఆవు నుంచి పాలు తాగాలంటే మరొకరి సహకారం తప్పనిసరిగా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories