Viral Video: సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..వైరల్ వీడియో

Viral Video:  సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..వైరల్ వీడియో
x
Highlights

Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటికీ నుంచి ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్లు ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ...

Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటికీ నుంచి ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్లు ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందికి ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ సింహానికి తేనెటీగలు చుక్కలు చూపించాయి.

anil.beniwal29 అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఈ వీడియో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం..ఓ సింహం తేనెటీగలతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. కొన్నివేల తేనెటీగలు సింహం శరీరాన్ని చుట్టుముట్టాయి. సింహం శరీరంపై తేనెపట్టును పెట్టాయి. సింహం శరీరం అంతా తేనెటీగలతో నిండింది. సింహం నడుస్తున్నా పడుకున్నా ఆ తేనెటీలు మాత్రం వదలడం లేదు. వాటిని ఎలా వదిలించేకోవాలో తెలియక సతమతమవుతోంది. సింహం పరిస్థితిని చూసి అడవిలో ఉన్న రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. తేనెటీగల బారి నుంచి సింహాన్ని కాపాడింది. దీంతో ఆ సింహానికి విముక్తి లభించింది.


ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేసి తమ కామెంట్స్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories