సీఏఏ భారత స్వయంకృత అపరాధం: శివశంకర్‌ మీనన్‌

సీఏఏ భారత స్వయంకృత అపరాధం: శివశంకర్‌ మీనన్‌
x
Highlights

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏపై మాజీభద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సంచలన వ్యాఖ్యలు...

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏపై మాజీభద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టంపై నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన శివశంకర్ మాట్లాడుతూ..భారత స్వయంకృత అపరాధంగా ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆలోచనను మార్చాలనుకుంటే దాని ఫలితంగా తలెత్తే వివాదాలకు సిద్ధంగా ఉండాలన్నారు.

2015కు ముందు దేశంలో అడుగుపెట్టిన ఇతర దేశాలకు చెందిన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, పార్శీ మతస్తులకు లబ్ధి చేకురుతుందని వ్యాఖ్యానించారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ద్వారా అప్ఘనిస్తాన్‌ , పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, దేశాలనుంచి వచ్చిన ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని శివశంకర్ మీనన్ పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ స్పందించారు. జామియా మిలీయా యూనివర్సిటీలో పోలీసులు ప్రవేశించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం ప్రజలకు పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

సీఏఏపై సరైన ప్రజలకు అవగాహన లేదని అందుకే‎ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని తెలిపారు. కాగా.. కేంద్రం ప్రభుత్వం 2019లో సీసీఏ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తలకు దారి తీశాయి. పోలీసులు, నిరసనకారులకు మధ్య దాడులు జరిగాయి. నిరసనకారులు పోలీసులపై దాడులు కూడా చేశారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారు.

అంతేకాకుండా పలువురు పోలీసులను తీవ్రంగా గాయపరిచారు పోలీసుల వాహనాలు దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. పలువురు నిరసనకారులు కూడా గాయపడ్డారు. కర్ణాటకలో కూడా తీవ్ర ఆందోళనలు కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ చట్టం తమ రాష్ట్రాల్లో అమలు చేయమని పలువరు ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు. కేంద్రం మాత్రం దీనిపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories