Top
logo

బీజేపీపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఫైర్‌

బీజేపీపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఫైర్‌
Highlights

మహారాష్ట్ర సీఎం పదవి శివసేనదే అని ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు సంజయ్‌ రౌత్‌ తేల్చిచెప్పారు. ప్రభుత్వ ...

మహారాష్ట్ర సీఎం పదవి శివసేనదే అని ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు సంజయ్‌ రౌత్‌ తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు చేయకుండా బీజేపీ వెనక్కి తగ్గడమంటే మహారాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడిందన్నారు. ఎన్నికల ముందు 50-50 ఫార్ములాకు అంగీకరించిన బీజేపీ ఫలితాలు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గిందని 50-50 ఫార్ములాను అనుసరిస్తే నష్టమేంటి? అని బీజేపీ నాయకులను సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని సంజయ్‌ చెప్పారు.

Next Story