శివసేనలో ముసలం.. 17 మంది రెబల్స్ తిరుగుబాటు

ఉద్ధవ్ థాకరే
x
ఉద్ధవ్ థాకరే
Highlights

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా శివసేనలో ముసలం పుట్టింది. మొత్తం 56 మంది ఎమ్మెల్యేలున్న శివసేనలో 17మంది తిరుగుబాటు...

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా శివసేనలో ముసలం పుట్టింది. మొత్తం 56 మంది ఎమ్మెల్యేలున్న శివసేనలో 17మంది తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. వారంతా ఉద్ధవ్ థాకరే అపాయింట్ మెంట్ కోరుతున్నారు. ఓపక్క సీఎం పదవి కోసం బీజేపీతో ఘర్షణ పడుతున్న శివసేనకు ఇప్పుడిది పెద్ద తలనొప్పిగా మారింది.

మరోవైపు ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరడం, ఆయన వెంటనే ఇవ్వడం జరిగిపోయాయి. వీరిద్దరి మధ్య అరగంట పాటూ భేటీ జరిగింది. మహారాష్ట్రలో రైతుల సమస్యలపై మోడీతో పవార్ చర్చించారు. వర్షాలకు పంట దెబ్బతిందని, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని పవార్ చెప్పినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అంశంపైనా పవార్ మోడీతో చర్చించారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై రేపు మధ్యాహ్నంలోపు స్పష్టత వస్తుందని శివసేన విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రైతుల సమస్యలపై చర్చించమని తామే పవార్‌ను ప్రధాని మోదీ వద్దకు పంపామని ఆపార్టీ చెబుతోంది. మరోవైపు ఈ పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ రద్దు చేసుకుని మరీ ప్రధాని మోదీతో పవార్‌ సమావేశమయ్యారు. పార్లమెంటు ఆవరణలో వీరి భేటీ జరిగింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories