శివసేన ప్రభుత్వానికి బిగ్ షాక్.. రాజీనామా బాటలో మంత్రి

శివసేన ప్రభుత్వానికి బిగ్ షాక్.. రాజీనామా బాటలో మంత్రి
x
Uddhav Thackeray, Abdul sattar File Photo
Highlights

మహారాష్ట్రలోని మహా వికాస్‌​ఆఘాడి ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది.

మహారాష్ట్రలోని మహా వికాస్‌​ఆఘాడి ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. మంత్రి వర్గ విస్తరణలో సహాయ మంత్రిగా ఉన్న అబ్దుల్‌ సత్తార్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కేబినెట్‌ హోదా దక్కకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాపై అబ్దుల్‌ సత్తార్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. అబ్దుల్‌ సత్తార్‌ రాజీనామా విషయాన్ని పార్టీ ఖండించింది. పదవుల పంపకాల విషయంలో మహా వికాస్‌ ఆఘాడీ కూటమికి ఏకాభిప్రాయం కుదరట్లేదని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

శివసేన పార్టీ సీనియర్ నేత ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాతూ.. అబ్దుల్‌ సత్తార్‌ ప్రభుత్వంలోనే కొనసాగుతారని తెలిపారు. మంత్రి పదవులపై ఎలాంటి గొడవలు లేవన్నారు. వరైనా రాజీనామా చేస్తే ఆ లేఖను సీఎంకు లేదా గవర్నర్ కు అందజేస్తారని, అలాంటి సమాచారం ఏమీ లేదని సంజయ్ రౌత్ అన్నారు. జీడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో సత్తార్‌ అసంతృప్తి చెందినట్లు చంద్రకాంత్‌ ఖైరే తెలిపారు. ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్‌ స్పందించారు. కొత్త శాఖలు ఏర్పాటు విషయమై ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. శాఖల కేటాయింపులో జాప్యం ఉన్నప్పటికీ మరో రెండు రోజుల్లో ఓ కొలిక్కి వస్తుందని తెలిపారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కొత్తగా 26 కేబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులుగా అవకాశం కల్పించారు. తాజా ఇది 43కి చేరింది. కాంగ్రెస్‌ తరపున 10 మంది కేబినెట్‌, ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. శివసేన నుంచి 10 మంది కేబినెట్‌ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు, ఎన్‌సీపీ నుంచి 12 మంది కేబినెట్‌ మంత్రులు, 4 సహాయ మంత్రులుగా ఉన్నారు.

అయితే కేబినెట్ బెర్త్ దక్కకపోవడంపై అబ్దుల్‌ సత్తార్‌ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. సిల్లోద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మె్ల్యేగా సత్తార్ ఎన్నికైయ్యారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. అయితే కాంగ్రెస్ ఔరంగాబాద్ సీటు దక్కకపోవడంలో శివసేనలో చేరారు. సత్తార్‌ రాజీనామాపై ఆయన మౌన వీడకపోవడంతో పలు రకాల చర్చలకు తావిస్తుంది. సత్తార్ రాజీనామా స్పష్టమైన ప్రకటన చేయాల్సివుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories