శివసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతారు ‌: ఎంపీ సంజయ్ రౌత్

Shiv Sena leader Sanjay Raut
x
Shiv Sena leader Sanjay Raut
Highlights

శివసేన పార్టీ కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ మూడు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

శివసేన పార్టీ కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ మూడు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత మూడు రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నఆయన ముంబైలోని లీలవతి ఆసుపత్రితో యాంజియోగ్రఫీ చికిత్స తీసుకున్నారు. శివసేపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సంజయ్ రౌత్ పునరుద్ఘాటించాడు. మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించకముందు రౌత్ శివసేన పార్టీ తరపున తన వాయిస్ ను గట్టిగా వినిపించారు. కాంగ్రెస్, ఎన్సీపీతో చర్చలు కూడా జరిపారు. అనూహ్యంగా ఆయన ఛాతీ నొప్పితో ఆస్పత్రి పాలైయ్యారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు కొంత విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు.

మంగళవారం ప్రఖ్యాత హిందీ కవి సోహన్ లాల్ ద్వివేది రాసిన పద్యం అతను ట్వీట్ చేశారు - "లాహ్రాన్ సే దార్ కర్, నౌకా పార్ నహీన్ హోతి; కోషిష్ కర్నే వలోంకి, హర్ నహిన్ హోతి. హమ్ హోంజ్ కామ్యాబ్ జరూర్ హోంజ్". (తరంగాలకు భయపడేవారు ఎన్నడూ జలాలను దాటలేరు; ప్రయత్నిస్తూనే ఉంటారు, విజయం సాధిస్తారు. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము). ఈ ఉదయం రాష్ట్ర చీఫ్ బాలాసాహెబ్ తోరత్ పలువురు కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రిలో సంజయ్ రౌత్‌ను పరామర్శించారు. అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్సీపి అధ్యక్షుడు శరద్ పవార్, ఎంపీ సుప్రియా సులే, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే కూడా రౌత్‌ను పరామర్శించారు.

గతంలో దివంగత శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరేకు చికిత్స చేసిన ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ డాక్టర్ అజిత్ మీనన్ రౌత్ కూడా శస్త్రచికిత్స చేశారు. రౌత్ 15రోజులుగా స్వల్ప ఆనారోగ్యంతో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన రాజకీయ పరిణామల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైయ్యారు. కీలక సమయంలో ఆయన ఆస్పత్రి పాలవ్వడం శివసేనకు పెద్ద నష్టంమే చేకూర్చింది. మౌత్ పీస్ 'సామ్నా' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూడా పనిచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories