ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను ప్రతిపాదించిన శివసేన

ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను ప్రతిపాదించిన శివసేన
x
Highlights

రెండో పర్యాయం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నాయి. కమలం కాస్త వాడినట్టు కనిపించినా, మొత్తానికి వికసించానని అనిపించుకుంది.

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు కాస్త అటూఇటుగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి విజయం అందుకుంది. రెండో పర్యాయం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నాయి. కమలం కాస్త వాడినట్టు కనిపించినా, మొత్తానికి వికసించానని అనిపించుకుంది. మొత్తం 288 స్థానాల్లో, బీజేపీ-సేన కూటమి దాదాపు 159 స్థానాల్లో విజయం సాధించింది. అంటే మ్యాజిక్‌ ఫిగర్‌‌ 145కి, కేవలం 14 స్థానాలే అధికంగా సాధించాయి బీజేపీ సేన కూటమి. బీజేపీ 103 స్థానాలను గెలవగా, శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. గతం కంటే ఈ కూటమి 26 స్థానాలు కోల్పోయింది. ఇక ఊహించిన దానికంటే కాంగ్రెస్ కూటమి కాస్త మెరుగైన ఫలితాలే రాబట్టింది. కాంగ్రెస్‌, ఎన్సీపీలు దాదాపు 105 స్థానాల్లో విజయం సాధించాయి. ఇందులో కాంగ్రెస్‌వి 44 సీట్లు కాగా, గతం కంటే మెరుగ్గా 54 స్థానాలతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది శరద్‌ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ. ఈ ఫలితాలు బీజేపీ పాలనకు చెంపపెట్టులాంటివని శరద్‌ పవార్ వ్యాఖ్యానించారు. ఇంకోవైపు రెండు స్థానాలు సాధించింది ఎంఐఎం. ఇక ఇండిపెండెంట్లు, చిన్నా చితకా పార్టీలు 24 సీట్లలో గెలిచారు.

మరోవైపు బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో, శివసేన మద్దతు తప్పనిసరి కాబోతోంది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను ప్రతిపాదించింది శివసేన. తమక్కూడా ఒక టర్మ్‌ ప్రభుత్వం నడిపే అవకాశం ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ముందుగా తమకే ప్రభుత్వం నడిపే ఛాన్స్ ఇవ్వాలని బీజేపీని డిమాండ్‌ చేయబోతోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories