శశి థరూర్‌కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

శశి థరూర్‌కి కేంద్ర సాహిత్య అకాడమీ  పురస్కారం
x
Shashi Tharoor
Highlights

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రచయిత శశిథరూర్ మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రచయిత శశిథరూర్ మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఆయన రాసిన ఎన్ ఏరా ఆఫ్‌ డార్క్‌నెస్, ది బ్రిటీష్‌ ఎంపైర్‌ ఇన్‌ ఇండియా అనే నవలకు కేంద్ర సాహిత్య అవార్దు వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ 2019 సంవత్సరానికిగాను 23 భాషల్లో అవార్డులను ప్రకటించింది. దీంతో శశిథరూర్ కలం నుంచి రూపుదిద్దుకున్న ఈ పుస్తకానికి అవార్డు వచ్చింది. 2016లో శశిథరూర్‌ ఈ పుస్తకాన్ని రచించారు. కాగా సాహిత్య అకాడమీ పురస్కారం తరపున రూ.1లక్ష నగదు బహుమతిగా పొందనున్నారు.

భారత దేశంపై బ్రిటీష్‌ పరిపాలన దాని ప్రభావం గురించి. అలగే వారు దేశాన్ని ఏ విధంగా నాశనం చేశారనే దానిపై శశిథరూర్ పుస్తకంలో వెల్లడించారు. భారత దేశానికి సంపదను బ్రిటన్‌ పాలకులు ఎలా దొంగిలించారు? దేశంలో వస్త్ర, ఐరన్, షిప్పింగ్‌ ఇండస్ట్రీలను ఎలా నాశనం చేశారు అనేది ఈ పుస్తకంలో రచించారు. శశిథరూర్‌ స్వస్థలం లండన్‌ 1975లో ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలలో ఢిగ్రీ పూర్తి చేశారు. ఆయన 1978 వ సంవత్సరం అమెరికాలోని టఫ్ట్స్‌ యూనివర్సిటీ నుంచి ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లామాసీలో అండ్ అఫైర్స్‌ పై డాక్టరేట్ పూర్తి చేశారు.

శశిథరూర్ రాజకీయాల్లోను ఉన్నారు. కాంగ్రెస పార్టీ తరపున కీలక పదవులు నిర్వహించారు. అలాగే ఆయన రచించిన అనేక పుస్తకాలు మంచి సాహిత్య అభిమానుల్లో మంచి పేరు పొందాయి. అలాగే తెలుగులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. బండి నారాయణస్వామికి రచించిన శప్తభూమి రచనకు ఆయను అవార్డు లభించింది. శప్తభూమి నవల అంతా రాయలసీమ నేపథ్యంగా సాగుతుంది. బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడంపై రచయితలు హార్షం వక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories