ముదురుతోన్న వివాదం.. ఎన్‌సీపీకి చెందిన మంత్రులతో సమావేశమైన శరద్ పవర్

ముదురుతోన్న వివాదం.. ఎన్‌సీపీకి చెందిన మంత్రులతో సమావేశమైన శరద్ పవర్
x
Highlights

కోరేగావ్‌-భీమా కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కోరేగావ్‌-భీమా కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ మరియు ఎన్‌సీపీలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ విప్లవ రచయిత వరవరరావు సహా మరికొందర్ని ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసుపై పునర్విచారణ జరిపించాలని తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఈ కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేసిందని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ విమర్శించారు. ఈ చర్య శివసేన మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవకు దారితీసింది. కేంద్ర నిర్ణయానికి శివసేన మద్దతు పలికింది.. దీనిపై అడ్డుచెప్పకుండా కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేసింది.

ఈ క్రమంలో సోమవారం మొత్తం 16 మంది పార్టీ మంత్రులతో సమావేశమైన శరద్ పవార్.. ఉద్ధవ్ ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైబీ చవాన్ సెంటర్ లో శరద్ పవార్ పార్టీకి చెందిన మంత్రులతో సమావేశం నిర్వహించారు. భీమా కోరేగావ్ కేసు దర్యాప్తును పూణే పోలీసులు ఎన్‌ఐఏకు అప్పగించిన తరువాత మహారాష్ట్ర పోలీసుల ప్రవర్తన అభ్యంతరకరమని శరద్ పవార్ తెలిపారు. ఇందులో అధికారుల పాత్రను దర్యాప్తు చేయాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు.. పోలీసు అధికారులతో సమావేశమయ్యారని.. ఆ తర్వాత కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు సూచించిందని.. రాజ్యాంగం ప్రకారం ఇది తప్పు, ఎందుకంటే నేరాల దర్యాప్తు రాష్ట్ర అధికార పరిధిలో ఉంటుందని గుర్తుచేశారు.

మరోవైపు భీమా కోరేగావ్ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించినందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నిర్ణయాన్ని శరద్ పవార్ వ్యతిరేకిస్తున్నారని, నిజం బయటకు వస్తుందనే భయం ఆయనలో ఉందని ఆరోపించారు. అదే సమయంలో, ఫడ్నవిస్ అధికార పార్టీ శివసేనను మళ్లీ పోటీ చేయాలని సవాలు చేశారు. కేసుపై వాస్తవాలు తెలుసుకోవడానికి ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసు అధికారులతో సమావేశం జరిపిన వెంటనే కేంద్రం కేసును బదిలీ చేసిందని విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories