రిసార్టులో మరో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

రిసార్టులో మరో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
x
Highlights

రిసార్టులో మరో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు రిసార్టులో మరో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

భోపాల్ లో ఎనిమిదేళ్లుగా హనీ ట్రాప్ ద్వారా సాగుతున్న సెక్స్ రాకెట్ దందాను ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే రిసార్టులో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. డెహ్రాడూన్ లోని కయారి గ్రామంలోని రిసార్ట్ నుంచి కొన్నేళ్లుగా సాగుతున్న సెక్స్ రాకెట్‌ను స్థానిక పోలీసులు ధ్వంసం చేశారు. పక్కా సమాచారంతో పోలీసు బృందం అర్ధరాత్రి రిసార్ట్ పై దాడి చేసింది. దాంతో నలుగురు విటులు, ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. కయారి గ్రామంలో ఉన్న మధుబన్ రిసార్ట్ చట్టవిరుద్ధంగా పనిచేస్తోందని, ఇక్కడ కేవలం డ్యాన్స్ పార్టీలు మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఉందని.. అయితే కొంతకాలంగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం అందడంతో దాడి చేశామని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రవి సైని చెప్పారు.

ఈ రిసార్టులో మహిళలతో అసభ్యకరమైన దుస్తులు ధరించి రిసార్ట్ యాజమాన్యం సెక్స్ రాకెట్టు నడుపుతోందని ఆయన చెప్పారు. ఈ దాడిలో ఢిల్లీ దిల్‌షాద్ గార్డెన్ కు చెందిన అనిల్ కుమార్, బాన్స్‌ఖేడి నివాసి సుజ్బ్ కుమార్, సహద్రా నివాసి అభిషేక్, అలాగే సోను మకాన్లను అరెస్ట్ చేసినట్లు సైని తెలిపారు. అలాగే ఆరుగురు మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఇక ఈ దాడిలో రూ .10,8200 నగదు, సఫారి కారు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories