Madhya Pradesh: తండ్రిని తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు

Seven Year Old Son Took His Father To The Hospital On Cart
x

Madhya Pradesh: తండ్రిని తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు

Highlights

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సింగ్రౌలీ జిల్లాలో హృదయవిదారక ఘటన

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని తల్లి సాయంతో ఏడేళ్ల కుమారుడు తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అంబులెన్స్​రాకపోవడంతో మూడు కిలోమీటర్లు తన తండ్రిని తోపుడుబండిపై తోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బాధితుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడని, 20 నిమిషాలైనా అంబులెన్స్​రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు 108కి ఫోన్ చేసినా లాభం లేకుండాపోయిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories