మర్మాంగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి ముగ్గురికి చిత్రహింసలు.. అసలేం జరిగింది?

Seven held for Torturing Three Car Dealers With Electric Shock in Karnataka
x

మర్మాంగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి ముగ్గురికి చిత్రహింసలు.. అసలేం జరిగింది?

Highlights

మర్మాంగాలకు ఎలక్ట్రిక్‌ షాక్‌ పెట్టి ముగ్గురు వ్యక్తులను దారుణంగా హింసించిన ఘటనకు సంబంధించిన వార్తలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

మర్మాంగాలకు ఎలక్ట్రిక్‌ షాక్‌ పెట్టి ముగ్గురు వ్యక్తులను దారుణంగా హింసించిన ఘటనకు సంబంధించిన వార్తలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోల్లో ఆ ముగ్గురు వ్యక్తులు నగ్నంగా కనిపిస్తున్నారు. వీరికి ఎలక్ట్రిక్ షాక్‌లు ఇవ్వడంతోపాటు చిత్రహింసలు కూడా పెడుతున్నట్లు కనిపిస్తోంది.

అసలు ఎందుకు ఆ ముగ్గురినీ దారుణంగా హింసించారు, ఈ ఘటన ఎక్కడ జరిగింది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.

అసలు ఎక్కడ జరిగింది?

కర్ణాటకలోని కలబురిగిలో మే నాలుగో తేదీన ఈ ఘటన జరిగింది. దీనిపై మే ఐదో తేదీన ఉదయం 9.30 గంటలకు బాధితులు విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

‘‘ఒక సెకండ్ హ్యాండ్‌ కారు మొరాయిస్తోందని, దాన్ని చూసేందుకు రావాలని మాకు చెప్పారు. ఎవరూలేని చోటుకు మమ్మల్ని తీసుకెళ్లారు. మా దగ్గరున్న డబ్బులు తీసేసుకొని కర్రలతో తీవ్రంగా కొట్టారు. కరెంట్ షాక్‌లు కూడా పెట్టారు’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.

ఆ ఏడుగురు ఎవరు?

ఈ కేసులో ఏడుగురు నిందితులు ఇమ్రాన్ పటేల్, మహమ్మద్ మతీన్ అలియాస్ స్టీల్ మతీన్, మహమ్మద్ జియావుల హుస్సేన్, హమ్మద్ అఫ్జల్ షేక్, హుస్సేన్ షేక్, రమేశ్, సాగర్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

‘‘ఒక వాహనాన్ని అప్పగించడంలో ఆలస్యం చేశారనే ఆరోపణలపై ఆ ముగ్గురినీ నిందితులు కిడ్నాప్ చేశారు. తమను వదిలిపెట్టాలంటే డబ్బులు ఇవ్వాలని కూడా నిందితులు డిమాండ్ చేశారు’’ అని పీటీఐ వార్తా సంస్థతో పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మరికొంత మంది నిందితులు కూడా ఉన్నారని, వారిని కూడా పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నామని పోలీసులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories