Covishield - Serum: కొవిషీల్డ్ ఉత్పత్తి 50 శాతం మేర తగ్గించాలని సీరం నిర్ణయం

Serum Company 50 Percent Decreased the Covishield Production Because of No Orders | Covid Latest News
x

Covishield - Serum: కొవిషీల్డ్ ఉత్పత్తి 50 శాతం మేర తగ్గించాలని సీరం నిర్ణయం

Highlights

Covishield - Serum: ఒకవేశ భారీ మొత్తంలో స్టాక్ అవసరం అనుకుంటే అదనపు వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగిస్తాం - సీరం

Covishield - Serum: వచ్చే వారం నుంచి కొవిషీల్డ్ ఉత్పత్తిని 50శాతం మేర తగ్గించాలని నిర్ణయించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే ఒకవేళ దేశానికి భారీ మొత్తంలో స్టాక్ అవసరం అనుకుంటే.. అదనపు వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పారు.

ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేని కారణంగా కొవిషీల్డ్‌ ఉత్పత్తిని 50 శాతం తగ్గించనున్నామని తెలిపారు. ప్రభుత్వం కోరితే అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగిస్తామన్నారు. వచ్చే ఆరు నెలల్లో టీకాలు అందించలేని పరిస్థితిలో అయితే ఉండబోమని పేర్కొన్నారు. కేంద్రం సైతం 20 నుంచి 30 మిలియన్ డోసుల స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచుతుందని, ఎక్కువ రిస్క్ తీసుకోదని కూడా చెప్పారు.

అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు కొత్త వేరియంట్‌పై పనిచేయవని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. లాన్సెట్ జర్నల్‌ ప్రకారం ఆస్ట్రాజెనెకా 80 శాతం సమర్థత కలిగి ఉందని తేలినట్లు చెప్పుకొచ్చారు. సరైన సమాచారం లేకుండా అంచనాలు వేయడంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కొవాక్స్ కార్యక్రమం కోసం 40- 50 కోట్ల డోసుల ఆర్డర్‌లను సమీక్షించామని, ఆఫ్రికన్‌ దేశాల ప్రతినిధులతో టచ్‌లో ఉన్నానని వివరించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాక్సిన్ సరఫరా అవసరమైనదానికంటే ఎక్కువగా ఉందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories